మహేష్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. బర్త్ డే ట్రీట్‌గా ఎపిక్ బ్లాక్‌బస్టర్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక అదిరిపోయే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. మహేష్ బాబు కెరీర్‌లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పోకిరి’ రీ-రిలీజ్ కాబోతోంది.

అయితే ఈసారి కేవలం సాధారణ రీ-రిలీజ్ షోలు మాత్రమే కాకుండా, రీ-రిలీజ్ చిత్రాల చరిత్రలోనే తొలిసారిగా ఆగస్టు 9వ తేదీన స్పెషల్ మిడ్‌నైట్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఓ రీ-రిలీజ్ చిత్రానికి కూడా మిడ్ నైట్ షోలు పడటం చాలా అరుదు.

సాధారణంగా పెద్ద హీరోల కొత్త సినిమాలకు మాత్రమే ఉండే ఈ అర్ధరాత్రి షోల హడావుడిని, ఇప్పుడు ఒక రీ-రిలీజ్ సినిమాకు ప్లాన్ చేయడం సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ సినిమా అంటే మహేష్ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ పూనకాలే. మరి ఆగస్టు 9న థియేటర్లలో పండగ చేసుకోవడానికి, పాత రికార్డులను తిరగరాయడానికి సూపర్ స్టార్ అభిమానులు ఇప్పుడే సిద్ధమైపోతున్నారు.

Exit mobile version