దర్శకుడి విజన్ పట్ల ఇంప్రెస్ అయిన మహేష్ బాబు !
Published on Jun 19, 2018 8:50 am IST

తమిళ హీరో విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ చిత్రం తెలుగులో ‘అభిమన్యునుడు’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించిన డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు, విమర్శకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడ ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడ ఈ సినిమాను వీక్షించి సినిమా పట్ల తాను చాలా ఇంప్రెస్ అయ్యానని అన్నారు. దర్శకుడు మిత్రన్ విజన్, డైరెక్షన్ చాలా బాగా ఉన్నాయని, బాగా రీసెర్చ్ చేసి రాసిన ఈ సినిమా వేగంగా కూడ ఉందని అంటూ హీరో విశాల్, చిత్ర టీమ్ కు అభినందనలు తెలిపారు.

ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు సమర్పించారు. ప్రస్తుతం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లతో నడుస్తున్న ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ కూడ ఉంటుందని విశాల్ గతంలోనే తెలిపారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook