గల్లా జయదేవ్ గెలుస్తాడు అంటున్న మహేష్ బాబు

గల్లా జయదేవ్ గెలుస్తాడు అంటున్న మహేష్ బాబు

Published on May 3, 2014 2:41 PM IST

mahesh-babu1
గుంటూరు లోక్ సభ పార్లమెంట్ స్థానానికి పోటి చేస్తున్న తన భావకు ఇదివరకే మద్దతు తెలిపిన ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి భావపై తనకు ఉన్న అభిమానాన్ని తెలిపాడు. రాజకీయాల గురించి ఎన్నడు మాట్లాడని మహేష్, గల్లా జయదేవ్ తనకు స్పూర్తి అని, తన అభిమానులు జయదేవ్ ని గెలిపివాలని గత నెల తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే.

మరో నాలుగు రోజులలో ఎన్నికలు ఉన్నందున మరోమారు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా మహేష్ తన భావ ఎలాగైనా గెలిచి తీరుతాడు అని తెలిపాడు. గుంటూరులోని తన అభిమానులు ప్రజలు జయదేవ్ ని తమ సొంత మనిషిలా చుసుకున్తున్నారని, దానికి తను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపాడు. అంతేకాకుండా జయదేవ్ ప్రచారాన్ని గమనిస్తున్నానని, అతడు బారి మెజారిటీతో విజయం సాధిస్తాడు అని ఆశాబావం వ్యక్తం చేశాడు.

మహేష్ బాబు ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు