మళ్లీ మహేష్ సాయం తీసుకుంటున్న సుధీర్ బాబు !

Published on Aug 18, 2018 12:25 pm IST

సమ్మోహనం చిత్రం తో సాలిడ్ హిట్ కొట్టారు యువ హీరో సుధీర్ బాబు. ఈచిత్ర విజయంలో మహేష్ కూడా తన వంతు సహాయం చేశారు. ఈచిత్రాన్ని ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశారు మహేష్. ఇప్పుడు ఆయన మరో సారి సుధీర్ బాబు సినిమాను ప్రమోట్ చేయనున్నారు.

నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం’నన్ను దోచుకుందువటే’. ఈ చిత్రంలోని బిగ్ బాస్ అంతేమ్ అనే సాంగ్ మహేష్ చేతులమీదుగా విడుదలకానుంది. నాబా నటేష్ కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్ బాబు ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. వినాయకచవితి కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More