తెలుగు స్టేట్స్ లో ‘వారణాసి’కి షాకింగ్ టార్గెట్!?

తెలుగు స్టేట్స్ లో ‘వారణాసి’కి షాకింగ్ టార్గెట్!?

Published on Sep 6, 2026 3:14 PM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ల కలయికలో గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమా వారణాసి కోసం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా నుంచి మరో గేమ్ ఛేంజర్ లా నెక్స్ట్ లెవెల్ హైప్ తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంటుంది.

అయితే ఈ సినిమాపై ఉన్న హైప్ తో బిజినెస్ లెక్కలు కూడా ఆకాశాన్ని అంటేలా కనిపిస్తున్నాయి. తాజా రూమర్స్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో వారణాసి భారీ బిజినెస్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఏకంగా 320 కోట్లకి పైగా బిజినెస్ ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే జరుగుతున్నట్టు టాక్. ఇది మాత్రం సెన్సేషనల్ నెంబర్ అని చెప్పాలి.

గతంలో RRR, పుష్ప 2 లాంటి సినిమాల రికార్డులు ఈ సినిమా బ్రేక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక వారణాసి సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఎస్ ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు