మరోసారి మహేష్ – సందీప్ మూవీ పై రూమర్.. చక్కర్లు కొడుతున్న కాంబినేషన్ న్యూస్..!

మరోసారి మహేష్ – సందీప్ మూవీ పై రూమర్.. చక్కర్లు కొడుతున్న కాంబినేషన్ న్యూస్..!

Published on Jun 16, 2026 9:11 AM IST

sandeep-reddy-vanga-m

సూపర్‌స్టార్ మహేష్ బాబు, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’ బ్యానర్‌పై ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం ఉన్న ‘వారణాసి’, సందీప్ వంగా కమిట్ అయిన ప్రాజెక్ట్లు పూర్తయిన తర్వాత ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం ఉందంటూ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

​నిజానికి వీరిద్దరి కలయికలో సినిమా రావడం ఇదే మొదటి ఆలోచన ఏమీ కాదు. గతంలోనే ఏషియన్ సినిమాస్ నిర్మాణంలోనే మహేష్, సందీప్ వంగా కలిసి ‘డెవిల్’ అనే సినిమా చేయాల్సి ఉంది. ఆ సమయంలో ఇద్దరికీ ఈ నిర్మాణ సంస్థ అడ్వాన్స్‌లు కూడా ఇచ్చినట్లు సమాచారం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అప్పటినుంచి ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు.

​అయితే, ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఏషియన్ సినిమాస్ ఇద్దరికీ అడ్వాన్స్‌లు ఇచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ, మహేష్ ‘వారణాసి’ చిత్రం ముగిసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి నిజంగానే ఈ కాంబో సెట్ అయ్యే న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు