1020వ గుండెకు ఊపిరి పోసిన సూపర్ స్టార్ మహేష్.!

Published on Jan 17, 2021 1:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం రీల్ హీరోగా మాత్రమే కాకుండా రియల్ హీరో అని కూడా తెలిసిందే. తాను ఆర్జించే లాభంలో కొంతమేర మహేష్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి గుండెలకు ఆయుష్షు పోసే దేవునిగా నిలిచాడు. మరి అలా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు వేలాది చిన్నారి ప్రాణాలను కాపాడినవాడిగా నిలిచాడు.

కొన్ని రోజుల కితమే 1019వ ప్రాణాన్ని కాపాడిన మహేష్ ఇప్పుడు మరో ప్రాణంతో కలిపి 1020వ ప్రాణంను కాపాడిన వాడిగా నిలిచాడు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత షేర్ చేసారు. షేక్ రిహాన్ అనే చిన్నారి ట్రయాలజి హార్ట్ సర్జరీతో సేఫ్ గా బయట పడడం తనకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలియజేసారు. అంతే కాకుండా ఆ బాబు మరింత ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాని తెలిపారు. అలాగే ఏపీ హెల్త్ కేర్ డాక్టర్స్ కు తన ధన్యవాదాలు కూడా తెలిపి ఈ ఆనందకర విషయాన్ని తెలిపారు.

సంబంధిత సమాచారం :