మేనల్లుడికి మంచి సలహా ఇచ్చిన మహేష్ బాబు

మేనల్లుడికి మంచి సలహా ఇచ్చిన మహేష్ బాబు

Published on Nov 10, 2019 11:36 AM IST

Mahesh Babu

మహేష్ బాబు మేనల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త, పొలిటీషియన్ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఇతని చిత్రం ఈరోజే లాంఛనంగా మొదలుకానుంది. ఈ సందర్బంగా సూపర్ స్టార్ మహేష్ తన మేనల్లుడికి శుభాకాంక్షలు చెబుతూ బాగా కష్టపడి పనిచెయ్, నువ్వు నేర్చుకున్నదంతా ఇవ్వు.. ఆ విజయమే నిన్ను వెతుక్కుంటూ వస్తుందని ఉత్తమమైన సలహా ఇచ్చారు.

ఇకపోతే ఈ లాంఛన కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ చిత్రాన్ని ‘భలే మంచి రోజు, దేవదాస్, శమంతకమణి’ డైరెక్ట్ చేయనుండగా గల్లా పద్మావతి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇందులో అశోక్ సరసన నిధి అగర్వాల్ కథానాయకిగా నటించనుంది. ఘిబ్రన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందివ్వనున్నారు.

తాజా వార్తలు