సోషల్ మీడియాలో కొత్త రికార్డు అందుకున్న మహేష్.!

సోషల్ మీడియాలో కొత్త రికార్డు అందుకున్న మహేష్.!

Published on Oct 28, 2022 4:21 PM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తన కెరీర్ లో 28వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనిపై భారీ అంచనాలు నెలకొనగా మేకర్స్ కొత్త షెడ్యూల్ ని త్వరలో స్టార్ట్ చెయ్యనున్నారు. మరి మహేష్ కి అయితే సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ కోసం కూడా అందరికీ తెలిసిందే.

ఆలా లేటెస్ట్ గా మహేష్ అయితే ఓ సాలిడ్ రికార్డు అందుకున్నట్టు తెలుస్తుంది. మహేష్ తన ట్విట్టర్ లో అయితే లేటెస్ట్ గా 13 మిలియన్ మంది ఫాలోవర్స్ ని మహేష్ ఇప్పుడు సొంతం చేసుకున్నాడు. దీనితో అయితే సోషల్ మీడియాలో 13 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్న సౌత్ ఇండియా మొదటి హీరోగా మహేష్ అయితే ఇప్పుడు రికార్డు సెట్ చేసాడు. దీనితో సోషల్ మీడియాలో మహేష్ కి ఉన్న ఫాలోయింగ్ ఏపాటిదో మళ్ళీ ప్రూవ్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు