Forever My Little Star: నువ్వు ఎంత ఎదిగినా నా లిటిల్ స్టార్‌వే.. కూతురిపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

Forever My Little Star: నువ్వు ఎంత ఎదిగినా నా లిటిల్ స్టార్‌వే.. కూతురిపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

Published on Jul 20, 2026 11:23 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరపై ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం పక్కా ఫ్యామిలీ మేన్ లా మారిపోతుంటారు. ముఖ్యంగా తన పిల్లలు సితార, గౌతమ్‌లకు సంబంధించిన స్పెషల్ మూమెంట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన ముద్దుల కుమార్తె సితార పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక ఎమోషనల్ అండ్ క్యూట్ పోస్ట్ పెట్టారు.

కూతురిపై కురిపించిన ప్రేమ..

ఈ స్పెషల్ పిక్‌లో మహేష్ బాబు తన కుమార్తె సితారను ఎంతో ప్రేమగా ముద్దాడుతూ కనిపించారు. ఒక రెస్టారెంట్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో ఈ ఫోటో తీసినట్లు తెలుస్తోంది. టేబుల్‌పై బర్త్‌డే క్యాప్స్, డెకరేషన్స్ కనిపిస్తుండగా, సితార తలపై ఒక క్యూట్ క్రౌన్ కూడా ఉంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. “నువ్వు ఎంత ఎదిగినా ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే.. హ్యాపీ 14 సితార! ఈ ఏడాది నీకు ఎంతో అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను.. లవ్ యూ ఆల్వేస్” అంటూ మహేష్ బాబు క్యాప్షన్ రాసుకొచ్చారు.

తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ఈ అందమైన బంధాన్ని చూసి ఘట్టమనేని అభిమానులు ఫిదా అవుతున్నారు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫోటోకు వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. సితారకు శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజా వార్తలు