దుమ్ముదూళిలో షూటింగ్ చేస్తున్న మహేష్ బాబు

Published on Feb 25, 2014 5:50 pm IST

Mahesh-Babu-Srinu-Vaitla
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బళ్ళారిలో ‘ఆగడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బళ్ళారిలోని మైనస్ ప్రాంతంలో షూట్ చేస్తున్నారు. అక్కడ బాగా దుమ్ము దూళి నడుమ అక్కడే షూట్ చేస్తున్నారు. అలా ఉన్నాసరే మహేష్ బాబు ప్రొఫెషనల్ గా అక్కడ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

శ్రీను వైట్ల ఈ సినిమాకి డైరెక్టర్. కండిషన్స్ బాగోలేకపోయినా మహేష్ బాబుకి మరియు అతని టీంకి శ్రీను వైట్ల థాంక్స్ చెప్పాడు. ‘ విజువల్స్ బాగా ఉండటం కోసం బాగా దుమ్ము దూళి నడుమ షూటింగ్ చేస్తున్నాం. సహాయసహకారాలు అందిస్తున్న మొత్తం టీంకి హ్యాట్సాఫ్. ముఖ్యంగా మహేష్ బాబుకి నా స్పెషల్ థాంక్స్’ అని శ్రీనువైట్ల ట్వీట్ చేసాడు.

తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :