సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్ లో సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకి ముఖ్య అతిథగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో అయన మాట్లాడుతూ సుధీర్ బాబు నటించిన సమ్మోహనం చాలా పెద్ద హిట్ అవుతుందని సుధీర్ నాసినిమాలకి వచినప్పుడు ఎక్కువగా మాట్లాడుతాడు ఇప్పుడు తన సినిమా కి తక్కువ మాట్లాడాడు అన్నారు . అలాగే ఈ సినిమా దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి గురించి మాట్లాడుతూ అయన డైరెక్ట్ చేసిన అష్ట చమ్మా , జెంటిల్ మెన్ సినిమాలు చూశాను చాలా బాగున్నాయి . ఈ సినిమా కూడా మంచి విజయం సాదిస్తుందని అన్నారు .
ఇక అభిమానులని ఉద్దేశిస్తూ భరత్ అనే నేను సినిమా తరువాత మళ్ళి మిమ్మల్ని ఈ సినిమాకే కలిశాను . మీ ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని మీ అందరికి ధన్యవాదాలు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు .


