మహేష్ బాబు – శ్రీను వైట్ల సినిమా టైటిల్ ‘ఆగడు’

Published on Jan 18, 2013 1:35 pm IST

Srinu-Vytla-Next-Film-With-
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘దూకుడు’ కాంబినేషన్ మరోసారి రిపీట్ చేయనున్నారు. మహేష్ బాబు ఈ సంవత్సరం శ్రీను వైట్ల డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ సినిమాకి ‘ఆగడు’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమాని ‘దూకుడు’ సినిమాని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి కూడా 14 రీల్స్ బ్యానర్ వారే నిర్మాతలు. అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట ఈ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తారు, వీరికి మహేష్ బాబుతో సత్సంబందాలున్నాయి. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :