మహేష్ హీరోగా హిందీలోకి డబ్ కానున్న ‘1’

మహేష్ హీరోగా హిందీలోకి డబ్ కానున్న ‘1’

Published on May 3, 2014 2:29 AM IST

1_Nenokkadine
మహేష్ బాబు హీరో గా నటించిన ‘1’- నేనొక్కడినే చిత్రం త్వరలో హిందీ లో డబ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను కూడా ఇటీవలే విడుదల చేశారు. ఆర్కే దుగ్గల్ స్టూడియో బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి ‘1’- ఏక్ కా దమ్ అనే పేరు పెట్టారు.

మహేష్ బాబు, కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం ఈ సంవత్సరంలో విడుదల అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం భారీ అంచనాలను అందుకోలేక పోయింది. మరి హిందీ లో బాక్స్ ఆఫీసు వద్ద ఎలా ఉండబోతోందో వేచిచూడాలి.

ప్రస్తుతం మహేష్ బాబు హైదరబాద్ లో జరుగుతున్న శ్రీను వైట్ల ఆగడు చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ‘1’ లో రాక్ స్టార్ గా కనిపించిన తరువాత కాస్త ప్రతికూల పరిస్దితులను మహేష్ బాబు ఎదుర్కొంటున్నారు. ఆగడు లో మహేష్ కీలక పాత్ర పోషించనున్నారు. పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా జంట గా నటిస్తోంది.

తాజా వార్తలు