తమిళ స్టార్ హీరో ఆడియో రిలీజ్‌కు మహేష్?

తమిళ స్టార్ హీరో ఆడియో రిలీజ్‌కు మహేష్?

Published on Jul 29, 2015 12:52 PM IST

mahesh-vijay
ఒకరు తెలుగులో సూపర్ స్టార్, మరొకరు తమిళంలో అదే స్థాయి గుర్తింపుతో ఇళయదళపతి అని పిలిపించుకుంటున్న స్టార్ హీరో.. వీరిద్దరూ ఒకే వేదికపై కలిస్తే ఎలా ఉంటుంది? ఈ కలయికకు రంగం సిద్ధమైందని తమిళ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా ‘పులి’ ఆడియో ఆవిష్కరణ వేడుకకు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

మహేష్ నటించిన తాజా సినిమా ‘శ్రీమంతుడు’ తమిళంలో ‘సెల్వందన్’గా విడుదల కానున్న విషయం తెలిసిందే! ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు కూడా ‘పులి’ ఆడియో వేదిక అవుతుందన్న ఆలోచనలో మహేష్‌ను ఆహ్వానించగా, ఆయన సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. చింబుదేవన్ దర్శకత్వంలో సుమారు వందకోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో ఆగష్టు 2న విడుదల కానుంది. ఇక మహేష్ బాబు శ్రీమంతుడు తమిళ ఆడియో చెన్నైలో జూలై 31న విడుదల కానుంది.

తాజా వార్తలు