త్వరలో ఆగడు షూటింగ్ లో పాల్గొనున్న మహేష్

Published on Mar 11, 2014 2:28 am IST

Mahesh-Babu-Aagadu
చిన్న విరామం తరువాత మరోసారి ‘ఆగడు’ సెట్స్ పైకి వెళ్ళింది. మహేష్ బాబు , తమన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాను వైట్ల తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే బళ్ళారిలో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాలో మహేష్ బాబు గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. అయితే అటువంటివి ఏమి లేవని, మహేష్ కేవలం అలిసిపోయాడని యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఇప్పుడు జర్గుతున్న కొత్త షెడ్యూల్ లో ఈ నెల 16నుండి మహేష్ పాల్గొనున్నాడు. హమ్ షకాల్స్ సినిమాకోసం మారీషస్ వెళ్ళిన తమన్నా కూడా ఆదే రోజు జతకలవనుంది. విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్, కామెడీ భాధ్యతలను బ్రహ్మానందం తీసుకున్నారు. రాయలసీమ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

థమన్ సంగీతదర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాత.

సంబంధిత సమాచారం :