వైరల్: “శ్రీదేవి సోడా సెంటర్” మూవీని వీక్షించిన మహేశ్ బాబు..!

Published on Aug 27, 2021 10:58 pm IST

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం సాలీడ్ అంచనాల నడుమ నేడు థియేటర్లలో విడుదలై సూపర్ టాక్‌ని అందుకుంది.

అయితే తాజాగా ఈ సినిమాని సూపర్ స్టార్ మహేశ్ బాబు వీక్షించారు. తన ఇంట్లోని మినీ థియేటర్లో సినిమను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మహేశ్ ఫోటోలను హీరో సుధీర్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :