సుధీర్ బాబు సినిమాలో మహేష్ బాబు.?

సుధీర్ బాబు సినిమాలో మహేష్ బాబు.?

Published on Jul 1, 2014 8:23 AM IST

Mahesh-Babu-Sudheer-Babu
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుధీర్ బాబు. తను ఇప్పటి వరకూ చేసిన 3 సినిమాల్లో తనకు హిట్ ఇచ్చిన సినిమా మాత్రం ‘ప్రేమకథా చిత్రమ్’. ఈ సారి హిట్ అందుకోవాలనే ఉద్దేశంతో సుధీర్ బాబు ఆచి తూచి రెండు సినిమాలను ఎంచుకున్నాడు. అవే ‘మాయదారి మల్లిగాడు’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ‘. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘చార్మినార్’ సినిమాకి రీమేక్ గా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ‘ సినిమా తెరకెక్కుతోంది.

సుధీర్ బాబు కెరీర్ కి కాస్త బూస్ట్ ఇవ్వడం కోసం, అలాగే తన సినిమాకి కాస్త క్రేజ్ తీసుకురావడం కోసం మహేష్ బాబుని రంగంలోకి దింపారు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాలో మహేష్ బాబు ఓ అతిధి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. మహేష్ బాబు బ్రాండ్ వల్ల ఈ సినిమాకి ఫుల్ క్రేజ్ రావడమే కాకుండా ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తాయని ఈ చిత్ర టీం ఆశిస్తోంది. నందిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పై లగడపాటి శిరీషా – శ్రీధర్ నిర్మిస్తున్నాడు. ఆర్. చంద్రు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.

తాజా వార్తలు