Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
మన సినిమా కోసం ఎదురుచూస్తున్నాను సర్ – మహేష్ బాబు
Published on Jan 11, 2019 4:00 pm IST

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సుకుమార్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సుకుమార్ కి ట్విట్టర్ ద్వారా ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. మహేష్ ట్వీట్ చేస్తూ… మోస్ట్ హంబుల్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే గొప్పగా ఉండాలి. మన సినిమా కోసం ఎదురుచూస్తున్నాను సర్’ అని మహేష్ ట్వీట్ చేశారు.

కాగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది మే నుండి మొదలు కానుంది. ఇక రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, మహేష్ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను తయారు చేశారట.

సంబంధిత సమాచారం :