పవన్ క్షేమం కోరుతూ మహేష్ బాబు ప్రార్థనలు

Published on Apr 16, 2021 11:40 pm IST

‘వకీల్ సాబ్’ విజయాన్ని ఆస్వాదిస్తున్న అభిమానులకు పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడటం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. నాలుగైదు రోజులుగా క్వారంటైన్లో ఉన్న ఆయనకు ఈరోజు పాజిటివ్ అని రిపోర్ట్స్ వచ్చాయి. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అభిమానులు తమ హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన సెలబ్రిటీలు సైతం పవర్ స్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది స్టార్లు పవన్ ఆరోగ్యం గురించి, క్షేమం గురించి ట్వీట్స్ చేయగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం పవన్ క్షేమాన్ని కోరుతూ ట్వీట్ చేశారు.

‘మీరు త్వరగా కొలుకోవాలి కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్. మీకు బలం చేకూరాలి. మీ కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఇండస్ట్రీ వ్యక్తులే కాదు రాజకీయ ప్రముఖులు సైతం పవన్ త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా కోరుతున్నారు. ప్రస్తుతం పవన్ తాను ఉన్నచోటే చికిత్స పొందుతున్నారు. ఒక వ్యక్తిగత వైద్యుడు, అపోలో వైద్య బృందం పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. పవన్ ఐసోలేషన్లో ఉండటంతో ఆయన చేస్తున్న రెండు సినిమాలు, రాజకీయపరమైన కార్యక్రమాలు వాయిదాపడ్డాయి.

సంబంధిత సమాచారం :