‘శ్రీమంతుడు’ డబ్బింగ్ ఫినిష్ చేసిన మహేష్

‘శ్రీమంతుడు’ డబ్బింగ్ ఫినిష్ చేసిన మహేష్

Published on Jul 26, 2015 9:17 PM IST

Srimantudu

సూపర్ స్టార్ మహేష్ బాబు – హాట్ బ్యూటీ శృతి హాసన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. ‘మిర్చి’తో సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. గత కొద్ది రోజులుగా సెకండ్ పార్ట్ డబ్బింగ్ లో బిజీగా ఉన్న మహేష్ నేటితో తన పార్ట్ కి డబ్బింగ్ ని ఫినిష్ చేసాడు. డబ్బింగ్ పరంగా ఎలాంటి పెండింగ్ లేకుండా ఈ సినిమాని పూర్తి చేసాడు. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మరో 3 లేదా నాలుగు రోజుల్లో పూర్తి కానున్నాయి. కొరటాల శివ అన్ని పనులను పరవేక్షిస్తూ ఫస్ట్ కాపీని సిద్దం చేసే పనిలో ఉన్నాడు.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జూలై 31న ‘శ్రీమంతుడు’ సినిమాని సెన్సార్ కి పంపనున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలో ఒక మల్టీ మిలినియర్ అయిన జగపతి బాబు కొడుకుగా కనిపిస్తాడు. అలాగే చాలా రోజుల తర్వాత మహేష్ బాబు ఓ కాలేజ్ స్టూడెంట్ గా కూడా కనిపించి యూత్ ని స్పెషల్ గా అట్రాక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం సమాజంలో అందరూ ఫాలో అవ్వాల్సిన ఓ మెసేజ్ ని పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పిన ఈ సినిమాలో జగపతి బాబు. సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి, అంగన రాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతలు.

తాజా వార్తలు