మలయాళంలో మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’

మలయాళంలో మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’

Published on Jan 22, 2015 5:26 PM IST

Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమా గత ఏడాది జనవరిలో విడుదలైంది. భారి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, ఈ సినిమా విమర్శకులను మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 6న విడుదలకు సిద్దమయింది. ‘1 ఒరుత్తం’ పేరుతో అనువదించారు.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు రాక్ స్టార్ గా నటించారు. ఈ సినిమాతో మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ వెండితెరకు పరిచయం అయ్యాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

తాజా వార్తలు