మరోసారి వైరలవుతున్న మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్స్!

Published on Sep 30, 2020 8:00 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబును చూస్తే ఏజ్ ను రివర్స్ గేర్ లో వెనక్కి లాగి ఉంచేసారేమోని అభిమానులు అంటుంటారు. అలా రోజులో మారే కొద్దీ మహేష్ మరింత యంగ్ లుక్ లో కనిపిస్తూ ఎప్పటిలానే స్టన్ చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలోనే మహేష్ తాలుకా ఇన్ హోమ్ లుక్స్ బయటకొచ్చి విపరీతంగా వైరల్ అయ్యాయి.

అలా షూటింగ్స్ లేని సమయంలోనే ఉంటే ఇక షూట్ కోసం బయటకొచ్చి ఒక లుక్ ప్రిపేర్ అవ్వాగా అది మరింత వైరల్ అయ్యింది. అయితే ఆ లుక్ తో అపుడు ఒక యాడ్ షూట్ లో మహేష్ పాల్గొన్నారని విన్నాం. ఇపుడు ఆ యాడ్ కు సంబంధించిన ఫొటోలే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇందుకు పూర్తి కారణం కూడా మహేషే అని చెప్పాలి. డిఫరెంట్ లుక్స్ లో కనిపించడం మాత్రమే కాకుండా ఆ అల్ట్రా స్టైలిష్ లుక్ తో అదరగొట్టారు. దీనితో మహేష్ ఈ లుక్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :

More