ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ మీరే నాన్న- మహేష్ బాబు !

Published on May 31, 2018 3:46 pm IST

నేడు సూపర్ స్టార్ కృష్ణగారు తన 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సంధర్బంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే అయన కుమారుడు మహేష్ బాబు కూడ శుభాకాంక్షలు తెలుపుతూ నా గురువు, నా బలం, నా స్ఫూర్తి మీరే. మీ కొడుకుగా పుట్టినందుకు గర్వ పడుతున్నాను. హ్యాపీ బర్త్ డే నాన్న. అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ కృష్ణగారితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నారు.

ఇటీవలే ‘భరత్ అనే నేను’ సినిమాతో విజయం అందుకున్న మహేష్ త్వరలో తన 25వ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.

సంబంధిత సమాచారం :