ఈ ప్రత్యేక రోజున మహేష్ మరో మహత్తర కార్యం.!

Published on May 31, 2021 2:00 pm IST

సిల్వర్ స్క్రీన్ పై ఒక్క హీరోగానే కాకుండా రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు నిజమైన హీరో అని అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలా ఇప్పటి వరకు వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి ఊపిరి పోసిన మహేష్ బాబు ఈరోజు తన తండ్రి నటశేఖర కృష్ణ గారి జన్మదినం సందర్భంగా మొట్ట మొదట తన విషెష్ తెలిపి తన వాత్సల్యాన్ని వ్యక్తం చేశారు.

మరి ఇదే రోజున మరో మహత్తర కార్యానికి మహేష్ పూనుకున్నారు. తాను దత్తత తీసుకున్న తన స్వస్థలం బుర్రిపాలెం గ్రామం అంతటికీ ప్రస్తుత ప్రమాదకర పరిస్థితి కరోనా విపత్తు నుంచి ముక్తి కల్పించడానికి పెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టి అక్కడి గ్రామస్తులు అందరికీ వ్యాక్సిన్ తన టీం తో వేయించడం జరిగింది. ఇలా ఒక తండ్రికి కొడుకుగా ఎంతో మంది ప్రాణాలను కాపాడి ఇంతకంటే గొప్ప బహుమానం ఇవ్వలేరని మహేష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.

సంబంధిత సమాచారం :