మహేష్ ..చిరు నుండి ఆశిస్తున్నది అదే..!

Published on Jan 6, 2020 8:41 am IST

సూపర్ స్టార్ మహేష్ హోస్ట్ చేసిన వేడుకలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరై సందడి చేయడం అటు సూపర్ స్టార్ అభిమానులతో పాటు మెగాస్టార్ అభిమానులకు మంచి జోష్ ఇచ్చింది. అలాగే మెగాస్టార్ వేదికపై ఉండగా సూపర్ స్టార్ ఏమి మాట్లాడతాడు అనే ఆసక్తికలిగింది. మహేష్ తన ప్రసంగంలో చిరంజీవిపై ప్రశంశల వర్షం కురిపించారు. ఏళ్లుగా ఆయన తనకు స్ఫూర్తిగా ఉన్నారని మహేష్ అన్నారు. ఒక్కడు మూవీ విడుదల తరువాత ఫోన్ చేసి అభినందించారు అన్నారు. అలాగే పోకిరి సినిమా సక్సెస్ తరువాత ఆయన ఫోన్ చేసి పిలిస్తే వెళ్లికలిశాను..సినిమా గురించి రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నాం అన్నారు. అర్జున్ మూవీ చేసేటప్పుడు సెట్స్ కొచ్చి అక్కడ ఉన్న భారీ సెట్ చూసి అభినందించారు అన్నారు.

నా ప్రతి సినిమా విడుదల తరువాత మొదటి ఫోన్ చిరంజీవి గారు చేస్తారు. రేపు జనవరి 11న కూడా ఆయన ఫోన్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇక సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ లో మహేష్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. అటు కామెడీ ఇటు సీరియస్ యాక్షన్ తో దుమ్మురేపాడు. ట్రైలర్ చూసిన తరువాత మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :