మహేష్-రాజమౌళిల నుండి ఓ హాలీవుడ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ రావాలట…!

మహేష్-రాజమౌళిల నుండి ఓ హాలీవుడ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ రావాలట…!

Published on Oct 23, 2019 7:04 AM IST

మహేష్-రాజమౌళి కాంబినేషన్ లో మూవీ ఎప్పుడూ హాట్ టాపిక్కే. పది ఏళ్లకు పైగా వీరు సినిమా చేస్తారని, మహేష్ ఫ్యాన్స్ అలాగే సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కారణాలేమైనా వీరిద్దరి సినిమాకి ఇంతవరకు ముహూర్తం కుదరలేదు. ఐతే బాహుబలి మూవీ తరువాత మహేష్ తో జక్కన్న సినిమా చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. గతంలో ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి, మహేష్ తో మూవీ చేయడానికి ఒక నిర్మాత దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నానని, త్వరలో మహేష్ తో మూవీ ఉంటుందని చెప్పడంతో, ఈ క్రేజీ కాంబినేషన్ ఇక లాంఛనమే అనుకున్నారు. కానీ రాజమౌళి అనూహ్యంగా ఎన్టీఆర్, చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ స్టార్ట్ చేశారు. దీనితో మహేష్, రాజమౌళి ల మూవీ మరుగున పడిపోయింది.

ఐతే వీరిద్దరూ కలిసి మూవీ చేస్తే ఎటువంటి చిత్రం చేయాలి? ఏ జోనర్లో ఐతే బాగుంటుంది? అని ఒక పోల్ నిర్వహించగా మెజారిటీ ఫ్యాన్స్ సైన్స్ ఫిక్షన్ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్త పరిచారు. దీని తరువాత మాస్ ఎంటర్టైనర్ వైపు మొగ్గుచూపారు. బాహుబలి లాంటి చిత్రంతో తెలుగు సినిమా ముఖచిత్రం మార్చేసిన రాజమౌళి నుండి మహేష్ ఫ్యాన్స్ ఆ జోనర్ లో మూవీ కావాలనుకోక పోవడం గమనార్హం. ఆరడుగుల హైట్, తెల్లగా హాలీవుడ్ కట్ కలిగిన మహేష్ కి సైన్స్ ఫిక్షన్ మూవీ బాగా సూట్ అవుతుందని వారు భావిస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్ లోనైనా వారి కోరిక నెరవేరుతుందేమో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు