అసహనంలో మహేష్… కారణం అదే..!

అసహనంలో మహేష్… కారణం అదే..!

Published on May 29, 2020 7:17 AM IST

Mahesh Babu 2

మరో రెండురోజులలో తన నూతన చిత్ర ప్రకటన ఉంటుంది అని అంచనా వేస్తుండగా మహేష్ బాబు అసహనంలో ఉన్నట్లు తెలుస్తుంది. దానికి కారణం ఆయన లేటెస్ట్ మూవీ టైటిల్ లీకు కావడమే. మహేష్ నెక్స్ట్ మూవీ దర్శకుడు పరశురామ్ తో చేస్తుండగా సర్కారి వారి పాట అనే టైటిల్ బయటికి వచ్చింది. ఇక దాదాపు ఇదే టైటిల్ ఖాయం అని వార్తలు వస్తుండగా మహేష్ దీనిపై అసహనంగా ఉన్నారట. టైటిల్ లీక్ విషయంలో తన పి ఆర్ టీం పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

ఇక బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలకు సంబంధించిన ట్రెండి సబ్జెక్టుతో పరుశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. సోషల్ కాన్సెప్ట్ టచ్ చేస్తూనే మహేష్ ఇమేజ్ కి తగ్గట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఓ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని సమాచారం. భరత్ అనే నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో హ్యాట్రిక్ పూర్తి చేసిన మహేష్ నెక్స్ట్ మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి.

తాజా వార్తలు