మన టాలీవుడ్ లో ఇప్పటికీ ప్రయోగాత్మక సినిమాలు చేయాలి అంటే సూపర్ స్టార్ మహేష్ బాబే ముందుంటారు. ఒక్క ప్రయోగాలతో మాత్రమే కాకుండా సమాజాన్ని ఉద్దేశించి మంచి సందేశాన్ని కూడా తన చిత్రం ద్వారా అందిస్తున్నారు. అయితే మహేష్ కెరీర్ లో భారీ హిట్లతో పాటు అంతే స్థాయి పరాభవాలు కూడా ఉన్నాయి.
అలాంటి వాటిలో దర్శకుడు సుకుమార్ తో తీసిన పాత్ బ్రేకింగ్ మూవీ “1 నేనొక్కడినే” కూడా ఒకటి.ఈ చిత్రంలో టేకింగ్ కానీ ట్విస్టులు కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటాయి అందుకే అప్పట్లో ఈ చిత్రం ఎవరికీ ఎక్కకపోయినా ఇప్పుడు మాత్రం మంచి కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ ప్లాప్ సినిమాకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.
మన తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేసి విడుదల చేస్తుంటారుగా అలాగే దీనిని కూడా చెయ్యగా దానికి ఏకంగా 100 మిలియన్ వ్యూస్ వచ్చి పడ్డాయి. దీనితో మహేష్ ప్లాప్ తో రికార్డు స్థాయి వ్యూస్ ను అందుకొని అదరగొట్టారని చెప్పొచ్చు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ తో “సర్కారు వారి” పాట అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
