నవీన్ పొలిశెట్టికి వేరే లెవెల్ ఎలివేషన్ ఇచ్చిన మహేష్.!

Published on Mar 13, 2021 1:03 pm IST

యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంలో మన తెలుగు స్టార్ హీరోలు ఎప్పుడూ ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తమ వంతు సహకారం ఎప్పుడు యువ టాలెంట్ కు అందిస్తారు. మరి అలా లేటెస్ట్ గా వచ్చిన ఓ యువ సెన్సేషనల్ కాంబో “జాతి రత్నాలు”.

దర్శకుడు నుంచి హీరో వరకు పూర్తిగా యువ టాలెంట్ తో వచ్చి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నటుడు నవీన్ పొలిశెట్టి నటనకు అయితే అప్పుడే అందరూ స్టన్ అయ్యారు. మరి ఈ జాతి రత్నాలలో ఏ రేంజ్ లో చేసాడు అన్నది మహేష్ అతనిపై కురిపించిన ప్రశంసల జల్లు చూస్తే అర్ధం అవుతుంది.

అయితే నవీన్ హీరోగా చెయ్యక ముందే పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.”లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” అలాగే మహేష్ తో “1 నేనొక్కడినే” లో తన వీరాభిమానిగా కూడా కనిపించాడు. మరి అప్పటి రోజులలో నవీన్ గు గుర్తు చేసి “1 సెట్స్ తో అతనితో మాట్లాడిన సందర్భం ఇంకా గుర్తు ఉందని అతని మాటల్లో స్పష్టత, సెట్స్ తన ప్రవర్తన అంతా చూస్తే ఈ అబ్బాయిలో ఏదో స్పార్క్ ఉందని అనిపించిందని ఇక ఈ సినిమాలో అతని అద్భుత నటన చూసి నా మైండ్ బ్లో చేసాడని” నవీన్ పై ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు.

అంతే కాకుండా “జాతి రత్నాలు” టీం అందరికీ కంగ్రాట్స్ చెబుతూ తాను సూపర్బ్ గా ఎంజాయ్ చేసానని తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మొత్తానికి మాత్రం నవీన్ కు మహేష్ నుంచి వేరే లెవెల్ ఎలివేషన్ దక్కింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :