‘సర్కారు’ ప్లాష్ బ్యాక్ లో మహేష్ కొత్త లుక్ !

Published on Feb 28, 2021 11:01 pm IST

మహేష్ ‘పోకిరి’ సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా అంత హిట్ అవ్వడానికి మహేష్ లుక్ కూడా ఒక కారణం. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత మహేష్ అలాంటి లుక్ నే ‘సర్కారు వారి పాట’ సినిమాలో ట్రై చేస్తున్నాడు. రింగుల జుట్టుతో కాలేజీకి వెళ్లే స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్ తో మహేష్ కొత్తగా కనిపించబోతున్నాడు. అయితే, ఈ లుక్ కేవలం ప్లాష్ బ్యాక్ లో మాత్రమే వస్తోందట. కాగా వచ్చే షెడ్యూల్ నుండే ఈ లుక్ లో కనిపించే సీన్స్ ను షూట్ చేయనున్నారు.

కాగా భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని.. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అన్నదే మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :