సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు ‘భరత్ అనే నేను’ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు సతీమణి నమ్రత ఈ విజయం పట్ల చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఇటీవల జరిగిన మీడియా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మహేష్ గురించిన పలు విశేషాల్ని బయటపెట్టారు.
ముందుగా ఈ సక్సెస్ మహేష్ కు ఎంత ముఖ్యమైందో వివరించిన ఆమె మహేష్ బాబుకు తన అభిమానుల్ని నిరుత్సాహపరచడం అస్సలు ఇష్టడం ఉండదు. ఎప్పుడూ వారి పట్ల ఒక భాద్యతను ఫీలవుతారాయన. చివరి రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తనను తానే ప్రశ్నించుకున్నారు. ఆ ప్రశ్నలకి సమాధానం ‘భరత్ అనే నేను’తో దొరికింది అన్నారు.
అలాగే మహేష్ కెరీర్ పై తన ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అన్ని నిర్ణయాలు తనవేనని అందరూ అనుకుంటుంటారు, కానీ అలాంటిదేం లేదు. ఆయన సొంత నిర్ణయాలు ఆయనకుంటాయి. సినిమాలు, ప్రకటనలు అన్నీ ఆయన ఇష్టాలే. సినిమా కథల గురించి మాత్రం నాతో క్యాజువల్ గా మాట్లాడుతుంటారు. ఏదైనా ఫైనల్ డెసిషన్ ఈయనదే అన్నారు.


