గౌతమ్ అరంగేట్రానికి మహేష్ ప్లాన్స్..!

Published on May 26, 2020 7:30 am IST

అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైన మహేష్ చాలా సినిమాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు కంటే కూడా యాక్టీవ్ కిడ్ గా బాగా ఫేమస్ అయిన మహేష్ సోలో హీరోగా బాల చంద్రుడు మూవీ చేశారు. ఇక తండ్రి కృష్ణ, అన్న రమేష్ తో కలిసి కొన్ని చిత్రాలలో కనిపించారు. ఆ తర్వాత 1999లో మహేష్ రాజకుమారుడు మూవీతో పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ ఇమేజ్ మహేష్ కి బాగా ఉపయోగపడింది. అప్పటికే నటుడుగా తనని తాను ప్రూవ్ చేసుకున్న మహేష్ ని ఓ కొత్త హీరోగా ప్రేక్షకులు భావించలేదు.

ఇక మహేష్ నటవారసుడు గౌతమ్ కూడా నేనొక్కడినే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యాడు. అప్పట్లో ఏడాదికి ఓ హీరో పది సినిమాలు కూడా చేశేవారు. దీనితో కృష్ణ మహేష్ ని తన సినిమాలలో నటింపజేశారు. ఇప్పటి పరిస్థితి వేరు. అందుకే సోషల్ మీడియా వేదికగా గౌతమ్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేస్తున్నాడు మహేష్. లాక్ డౌన్ కారణంగా ఇంటిలోనే ఉంటున్న మహేష్, కొడుకు గౌతమ్ తో చేస్తున్న సరదా అల్లర్లు మొత్తం సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది వరకు పెద్దగా పరిచయం లేని గౌతమ్ ఆక్టివిటీస్ ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి. ఎటూ మరో ఐదు లేదా ఆరేళ్లలో గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం. కాబట్టి ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ ఆయన ఎంట్రీకి బాగా ఉపయోగపడవచ్చు.

సంబంధిత సమాచారం :

More