మహేష్ క్రేజ్ కు వయసుతో సంబంధం లేదు !

మహేష్ క్రేజ్ కు వయసుతో సంబంధం లేదు !

Published on Nov 26, 2018 11:52 AM IST

mahesh fans
సూపర్ స్టార్ మహేష్ బాబు కు యూత్ లో వున్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. కానీ యూత్ తో పాటు పాత తరం వారికి కూడా మహేష్ అంటే అభిమానం ఎలాంటిదో తాజాగా జరిగిన సంఘటన తెలిస్తే అర్ధం అవుతుంది. ఇక విషయానికి వస్తే రాజమండ్రికి చెందిన 106 సంవత్సరాల వయసు కలిగిన రేలంగి సత్యవతి, మహేష్ కు పెద్ద ఫ్యాన్. ఎప్పటినుండో మహేష్ ను కలవనుకున్న కుదురలేదు. తాజాగా ఆ అవకాశం ఆమె కి లభించింది. మహర్షి చిత్ర షూటింగ్ సెట్ కు ఆమెను పిలిపించి ఆమె తో సరదాగా మాట్లాడారు మహేష్. ఆ తరువాత ఆమె తో కలిసి ఫొటోలు కూడా దిగారు. ఈపోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి సత్యవతి గారిని కలిసినందుకు ఆమె కంటే ఎక్కువ నాకే సంతోషం గా ఉందని అన్నారు.

ఇక మహేష్ నటిస్తున్న మహర్షి ఈ చిత్రం యొక్క షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ఒక భారీ విలేజ్ సెట్ లో జరుగుతుంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు