నమ్రత ఫోటో పై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్ !

Published on Aug 30, 2021 3:31 pm IST

నమ్రత తాజాగా దిగిన ఫోటో షూట్ పై మహేష్ ‘పిక్చర్ పర్ఫెక్ట్’ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవరికేర్ తాజాగా నమ్రత ఫొటోస్ తీశాడు. ఈ ఫోటోలు తన లైఫ్ లోనే ప్రతికమైనవి అని అవినాష్ గోవరికేర్ ట్వీట్ చేశాడు. అయితే, మహేష్ ఆ ట్వీట్ లో నమ్రత ఫోటోలు చూసి పిక్చర్ పర్ఫెక్ట్ అని మెసేజ్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇక మహేష్ – నమ్రత తమ పిల్లల సరదా వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా ఈ లాక్ డౌన్ సమయంలో, మహేష్ ఇలాంటి పోస్ట్ లతో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా సాగుతోంది.

సంబంధిత సమాచారం :