మొదటి సినిమా నుండి తనతోనే ఉన్న వ్యక్తిని పరిచయం చేసిన మహేష్

మొదటి సినిమా నుండి తనతోనే ఉన్న వ్యక్తిని పరిచయం చేసిన మహేష్

Published on Sep 19, 2019 9:20 PM IST

mahesh1

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలకు సంబందించి కీలకమైన వ్యక్తిని పరిచయం చేశారు. అతనే సౌండ్ రికార్డిస్ట్ నగర రాము. ఈయన మహేష్ బాబు యొక్క మొదటి నుండి ఇప్పుడు చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు అన్ని సినిమాలకు పనిచేస్తూ వచ్చారు.

ఈయన గురించి మహేష్ చెబుతూ ‘ఈయన నా సౌండ్ రికార్డిస్ట్ నగర రాము. నా మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు. ఈయన్ను నా సినిమా సెట్స్ లో తప్ప మరొక సెట్స్ లో చూడలేదు. ఎప్పుడూ నాకోసం.. నాతో పాటే ఉన్నందుకు ఆయనకు నా కృతజ్ఞతలు’ అంటూ అయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

ఇకపోతే ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు