మహేష్ ను ఆకట్టుకున్న ట్రైలర్ !

Published on Aug 23, 2018 12:24 pm IST

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో నూతన దర్శకుడు జయశంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం యొక్క ట్రై లర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కథ మాటలు సంపత్ నందే అందించారు.

ఇక తాజాగా ఈ ట్రైలర్ ను చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పేపర్ బాయ్ ట్రైలర్ ను చూశాను. చాలా ఫ్రెష్ గా ఆహ్లదకరంగా వుందని చిత్ర టీంకు అల్ ది బెస్ట్అని మహేష్ ట్వీట్ చేశారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కావల్సి ఉండగా నాగ చైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ విడుదల వాయిదా పడడం తో వారం ముందుగానే ఆగస్టు 31న ప్రేక్షకులముందుకు వస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More