‘మహేష్’ తన ప్లాప్ సినిమా రీమేక్ తో హిందీలో ఎంట్రీ ఇవ్వనున్నాడా ?
Published on Jun 13, 2018 1:06 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్పైడర్’ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. అలాంటి ఈ స్పైడర్ చిత్రంతో మహేష్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన వార్తే. ఎందుకంటే మహేష్ కెరీర్ లో భారీ పరాజయంగా నిలిచింది ఈ స్పైడర్ చిత్రం.
దర్శకుడు మురుగదాస్ తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో స్పైడర్ ప్లాప్ అయినా తమిళనాట మాత్రం ఏవరేజ్ గా ఆడింది.

తాజా సమాచారం ప్రకారం మురుగదాస్ ప్రస్తుతం స్పైడర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. స్పైడర్ చిత్రంతో మహేష్ కు తెలుగులో ప్లాప్ ఇచ్చానని హిందీలో హిట్ ఇచ్చి లెక్క సరిచేస్తానంటున్నాడట మురుగదాస్. రెండు సినిమాలతో బిజీ గా ఉన్న మహేష్ ఈ ప్లాప్ చిత్రంతో హిందీలో అడుగుపెడతాడా అంటే డౌటే మరి !

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook