కొత్త సంవత్సరంలో మహేష్ – కొరటాల సినిమా టైటిల్ అనౌన్స్మెంట్..?

కొత్త సంవత్సరంలో మహేష్ – కొరటాల సినిమా టైటిల్ అనౌన్స్మెంట్..?

Published on Dec 23, 2014 11:54 PM IST

Mahesh-Babu-Koratala-Siva12
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ డిసెంబర్ 31 అర్ధరాత్రి ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ఖారారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవలే నిర్మాతలు ఈ టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఇదే టైటిల్ కంటిన్యూ చేస్తారా..? లేక వేరే టైటిల్ ప్రకటిస్తారా..? అనేది వేచి చూడాలి.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ డిసెంబర్ 28 నుండి ప్రారంభం కానుంది. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మది సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు