విరామం లేకుండా పనిచేస్తున్న మహేష్ బాబు !


సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రేక్ లేకుండా పనిచేస్తున్నారు. తాజాగా రొమానియాలో మురుగదాస్ సినిమా ‘స్పైడర్’ యొక్క ఆఖరి పాటను ముగించి సినిమాను పూర్తిచేసిన ఆయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా కోసం తయారవుతున్నారు. రేపటి నుండి ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలుకానుంది.

ఈ షెడ్యూల్లో మహేష్ బాబు కూడా పాల్గొంటారని సమాచారం. గతంలో మహేష్ – కొరటాల కలయికలో రూపొందిన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ చిత్రం పై అభిమానుల్లో మంచి క్రేజ్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ లో భారీ డిమాండ్ ఉన్నాయి. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ సంగీతం సమకూరుస్తుండగా 2018 ఆరంభంలో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నా టీమ్ ఇంకా దాన్ని ఖరారు చేయలేదు.