సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘ఆగడు’ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలోని క్లైమాక్స్ ఎపిసోడ్ ని హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఓ సాంగ్ షూట్ కోసం నార్వే వెళ్లనున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు – కొరటాల శివ సినిమా ఆగష్టు 11న లాంచనంగా ప్రారంభం కానుంది.
రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు పెట్టి సినిమాని 2015 సమ్మర్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుంది. మిగిలిన పూర్తి వివరాలను లాంచింగ్ రోజు తెలియజేయనున్నారు. ఆగష్టు 9న మాత్రం మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగడు సెకండ్ టీజర్ ని లాంచ్ చేయనున్నారు.


