ఈ నెల 28 నుండి మహేష్ – కొరటాల సినిమా తాజా షెడ్యూల్.

ఈ నెల 28 నుండి మహేష్ – కొరటాల సినిమా తాజా షెడ్యూల్.

Published on Dec 22, 2014 11:09 PM IST

Mahesh-Babu-Koratala-Shiva
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా మూడవ షెడ్యూల్ డిసెంబర్ 28 నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. దర్శకనిర్మాతలు అధికారికంగా వెల్లడించలేదు.

గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షెడ్యూల్ రెండు రోజుల క్రితం, డిసెంబర్ 20న పూర్తయింది. ఈ షెడ్యూల్ లో హీరో హీరోయిన్లు మరియు ఇతర తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మది సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు