మహేష్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే..!

Published on May 21, 2020 9:10 pm IST

మహేష్ నుండి కొత్త మూవీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి పెద్ద షాక్ తగిలింది. ఆ రోజున మహేష్ నుండి ఎటువంటి అప్డేట్స్ ఉండకపోవచ్చు. దానికి కారణం ఆయన తండ్రిగారైన కృష్ణ తన జన్మదిన వేడుకలు రద్దు చేసుకున్నారు. అభిమానులు సైతం వేడుకలు నిర్వహించడం కానీ, తనను కలవడం కానీ చేయవద్దన్నారు.

ఆయన సతీమణి విజయనిర్మల 2019 జూన్ 27న అకాలమరణం చెందారు. ఆమె మొదటి సంవత్సరీకం కూడా పూర్తికాని నేపథ్యంలో సంతాప సూచకంగా కృష్ణ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

కృష్ణ గారి నిర్ణయాన్ని గౌరవించి మహేష్ ఎటువంటి నూతన చిత్ర ప్రకటన చేయకపోవచ్చు. మహేష్ దర్శకుడు పరుశురాం తో మూవీ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ స్పష్టమైన సమాచారం ఉంది. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి తన నెక్స్ట్ మూవీ మహేష్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు సంబందించిన అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ భావించగా వారి కోరిక తీరే సూచనలు కనిపించడం లేదు.

సంబంధిత సమాచారం :

X
More