మహేష్ మీసంపై ఇంత రాద్ధాంతమా…!

Published on Jun 1, 2019 12:10 pm IST

మహేష్ 26వ సినిమాగా రానున్న “సరిలేరు నీకెవ్వరు” నిన్న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సంధర్భంగా అధికారికంగా మొదలైపోయింది.అనిల్ రావిపూడి డైరెక్టర్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు,మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన యంగ్ హీరోయిన్ రష్మిక మందాన చేస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేష్ ఇప్పటివరకూ చేయని ఓ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో చూయించాలనుకుంటున్నాడట. టైటిల్ లోగో లో తుపాకీ, గన్ కూడా ఉండటంతో ఈ వాదనకు బలం చేకూరుతుంది. అలాగే మరో వాదన మహేష్ రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడిలా కూడా కనిపించనున్నారని. మహేష్ పాత్ర ఆర్మీ ఆఫీసరైనా,ఫ్యాక్షనిస్టయినా మీసం ఉండాలి కదా , మరి మీసంలో నటించడానికి మహేష్ ఓకేనా..?ఒకవేళ ఒకే చేసినా కూడా మహేష్ కి మీసం నప్పుతుందా అనే చర్చఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైపోయింది.
మహేష్ కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు కోరమీసం తో ఉన్న మాస్ హీరో రోల్ చేసిందే లేదు. కొన్ని పాత్రలలో మీసంలో కనిపించే ఆస్కారం ఉన్నా ఆయన ఆ ఛాన్స్ తీసుకోలేదు. “భరత్ అనే నేను” లో మాత్రం మహేష్ ఓ పాటలో కొద్ది క్షణాలు మీసంతో కనిపించాడు. మీసంలో మహేష్ అచ్చు కృష్ణలా అనిపించారు.

అసలు ఇంకా షూటింగే మొదలుకాని సినిమాలోని మహేష్ పాత్రపై, అతని మీసంపై ఇంత చర్చ అవసరమా అని కొందరి వాదన. మరి సూపర్ స్టార్ మహేష్ విషయంలో ఎంత చిన్న విషయమైనా టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది మరి.

సంబంధిత సమాచారం :

More