మహేష్ అనుకున్నా, ఇప్పుడైతే కుదరదు.

Published on Mar 20, 2020 5:01 pm IST

మహేష్ ప్రస్తుతం తన తదుపరి దర్శకుడిని ఎంచుకొనే పనిలో ఉన్నారు. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ మాస్ ఎంటర్టైనర్ తరువాత ఆయన ఎటువంటి చిత్రం చేయాలనే ఆలోచనలో పడ్డారు. సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేకుండా అందరి దర్శకుల నుండి ఆయన కథలు వింటున్నాడు. కాగా మహేష్ కి త్రివిక్రమ్ తో మూవీ చేయాలనే ఆలోచన కూడా ఉందని తెలుస్తుంది. అల వైకుంఠపురంలో టేకింగ్ తో త్రివిక్రమ్ అందరినీ పడగొట్టాడు.

దీనితో ఆయతో మూవీ చేయాలనీ స్టార్ హీరోలందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కుదిరితే త్రివిక్రంతో మూవీ చేసే ఆలోచనలో మహేష్ ఉన్నాడట. ఐతే త్రివిక్రమ్ ఇప్పటికే ఎన్టీఆర్ 30వ చిత్రంకి కమిటై ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆయన ఫ్రీ కాడు. కాబట్టి మహేష్ త్రివిక్రమ్ తో మూవీ చేయాలనుకున్నా అది వచ్చే ఏడాదే అవుతుంది. గతంలో త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి.

సంబంధిత సమాచారం :