వైరల్ గా మారిన మహేష్ గడ్డం లుక్ !

వైరల్ గా మారిన మహేష్ గడ్డం లుక్ !

Published on Jun 6, 2018 11:53 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లుక్ కోసం ఎప్పుడూ లేనంతగా పూర్తిగా గడ్డం పెంచుతున్నారాయన. ప్రతి సినిమాలో అస్సలు గడ్డం లేకుండా క్లాస్ గా కనిపించే మహేష్ గడ్డంతో ఎలా ఉంటాడో చూడాలని ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే మహేష్ కొత్త లుక్ రివీల్ అయింది.

మహేష్ ముంబై విమాశ్రయం నుండి బయటకు వస్తుండగా కెమెరాలకు చిక్కారు. ఆ ఫోటోల్లో మహేష్ కొత్త లుక్ బయటపడింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అభిమానులైతే లుక్ చాలా బాగుందని, ఫస్ట్ లుక్ ఎప్పుడో చెప్పాలని దర్శక నిర్మాతల్ని కోరుతున్నాను. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలో డెహ్రాడూన్ లో మొదలుకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు