మహేష్ తొందరపడాల్సిన పనేం లేదు..!

Published on Apr 9, 2020 9:35 am IST

ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్, ఆ చిత్ర విడుదలకు ముందే దర్శకుడు వంశీ పైడిపల్లితో మూవీ ప్రకటించారు. కారణంగా ఏదైనా ఆ ప్రాజెక్ట్ ని మహేష్ పక్కన పెట్టేశారు. మహేష్ స్క్రిప్ట్ విషయంలో సంతృప్తి చెందలేదని..కాదు రెమ్యూనరేషన్ అడిగినంత ఇవ్వలేదని అనేక ప్రచారాలు జరిగాయి. మరో వైపు ఈ మూవీ ఆగిపోలేదు స్క్రిప్ట్ కి మహేష్ అడిగిన మార్పులు చేసే పనిలో వంశీ పైడిపల్లి ఉన్నాడని కూడా వినిపిస్తుంది.

ఐతే ఈ గ్యాప్ లో మహేష్ కొత్త దర్శకుల నుండి కథలు కూడా వింటున్నారని తెలుస్తుంది. ఆయన దాదాపు గీతగోవిందం డైరెక్టర్ పరుశురాం తో మూవీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఐతే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే, అధికారిక ప్రకటన మాత్రం రావాల్సింవుంది. ఐనా మహేష్ ఇప్పుడు తొందరపడి మూవీ ప్రకటించాల్సిన అవసరం లేదు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో కొత్త చిత్రాల షూటింగ్స్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. కాబట్టి మహేష్ ప్రశాంతగా ఓ బెటర్ స్క్రిప్ట్ తో రావడం బెటర్.

సంబంధిత సమాచారం :

X
More