మహేష్.. శాటిలైట్ రేట్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ !

Published on Jun 25, 2019 10:09 am IST

మహేశ్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా శాటిలైట్ రేట్ భారీగా పలికింది. ఏకంగా 16.5 కోట్లకు జెమిని టీవీ ‘సరిలేరు నీకెవ్వరు’ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుందట. ఒక విధంగా శాటిలైట్ హక్కుల్లో ఇంత భారీ మొత్తం రాబట్టిన సినిమా ఇదే. బ్లాక్ బస్టర్ ‘మహర్షి’కి కూడా శాటిలైట్ రేట్ 12 కోట్లు పలికింది. సరిలేరు నీకెవ్వరు మాత్రం విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం విశేషం.

ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే జగపతి బాబు కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More