ఒక సమాజంగా మనం విఫలం చెందాం- మహేష్

Mahesh Babu

”రోజులు నెలలవుతున్నాయి,నెలలు సంవత్సరాలవుతున్నాయి మనం మాత్రం మారడం లేదు, ఆడవాళ్లకు భద్రత ఇవ్వడంలో ఒక సమాజంగా మనం ఫెయిల్ అవుతున్నాం. వ్యక్తిగతంగా ప్రభుత్వాలకు నా విన్నపం ఏమిటంటే ఇలాంటి ఏహ్యమైన చర్యలకు పాల్పడిన వారికి మరణమే శిక్ష కావాలి. అలాంటి కఠిన చట్టాలు రావాలి, కొందరు దుర్మార్గుల వలన మాన ప్రాణాలు కోల్పోయిన ఆడ పిల్లల తల్లిందండ్రులకు నా ప్రఘాడ సంతాపం. వారి భాద ఎవరు తీర్చలేనిది, వారికి న్యాయం జరిగేవరకు కలిసిపోరాడుదాం” అని మహేష్ ట్విట్టర్ వేదికగా తన ఆవేదన ఆడపిల్లల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గత బుధవారం వెటనరీ డాక్టర్ మర్డర్ తో పాటు, తమిళనాడులో ఒక ఉదంతం ఇలా వరుస సంఘటనలు మన దేశంలో ఆడవారికి రక్షణ లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.

దీనితో సినీ, రాజకీయ, సామజిక రంగాలకు చెందిన ప్రముఖులు ఇలాంటి నీచ సంస్కృతికి వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడాలని ప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు. మహేష్ బాబు కూడా హైదరాబాద్ వేదికగా వెటనరీ డాక్టర్ మానభంగం మరియు మర్డర్ విషయంపై ఇలా స్పందించారు.

mahesh reacts emotional on veterinary doctor’s murder issue

Exit mobile version