“సర్కారు వారి” కోసం మహేష్ రెడీ.!

Published on Jun 5, 2021 11:00 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ పెట్ల సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లతో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది.

మరి ఈ గ్యాప్ లో కాస్త విరామం తీసుకున్న మహేష్ తన వ్యాక్సినేషన్ కూడా చేయించుకొని ఫిజికల్ గా ట్రైన్ కూడా అయ్యారు. మరి ఇప్పుడు ఎట్టకేలకు మళ్ళీ మహేష్ సంసిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ తన చిత్ర యూనిట్ అంతటికీ వ్యాక్సినేషన్ చేయిస్తున్న మహేష్ ఆ ఇతర పనులు అన్ని అయ్యిపోయాక రంగంలో దిగనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :